:

2 Peter 2

1

"మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధ బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసి కొనుచు, నాశనకరమగు భిన్నాభి ప్రాయములను రహస్యముగా బోధించుదురు."

2

మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.

3

"వారు అధికలోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు, మీ వలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు."

4

"దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను."

5

"మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను."

6

"మరియు ఆయన సొదొమ గొమ్ఱొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,"

7

దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.

8

"ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటిని బట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను."

9

"భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్ణీతిపరులును ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థు."

10

వీరు తెగుల గలవారును స్పేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువక యున్నారు.

11

"దేవదూతలు వారి కంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరతురు."

12

"వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశాన్యములగు మృగముల వలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతి ఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు."

13

ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడ అన్న పానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు.

14

"వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్ధిరులైన వారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,"

15

తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవతప్పిపోయిరి.

16

ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను; ఎట్లనగా నోరులేని గార్దభము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.

17

"వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరి కొరకు గాఢంధకారము భద్రము చేయబడియున్నది."

18

"వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, తామే శరీర సంబంధమైన దురాశలుగలవారై, తప్పు మార్గ మందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరిచేష్టల చేత మరలు కొల్పుచున్నారు."

19

"తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టి వారికి స్వాతంత్య్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా?"

20

"వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడిన యెడల, వారి కడవరి స్ధితి మొదటి స్ధితి కంటె మరి చెడ్ఢదగును."

21

"వారు నీతి మార్గమును అనుభవ పూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుట కంటె ఆ మార్గము అనుభవ పూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు."

22

"కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను."

Link: